హౌసింగ్ పథకంలో అర్హులైన వారందరికి ఇళ్ల స్థలా లు కేటాయించాలని మదనపల్లె ఆర్డీవో మురళి ఆదే శించారు. శనివారం స్థానిక సబ్‌కలెక్టరేట్ లో మదనపల్లె అర్బన పరిధిలోని 43 వార్డు సచివాలయ వీఆర్‌వోలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ పట్టణంలో కొన్ని చోట్ల హౌసిం గ్ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధి దారులకు స్థలాలు లేవని కొందరు సచివాలయ సిబ్బంది చెబుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని ఇలాంటి చెడ్డపేరు తెచ్చే పనులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు. నిరుపేదలు ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో వారికి స్థలాన్ని కేటాయించడంతో పాటు హౌసింగ్‌కు అనుసంధానం చేయాల న్నారు. ఇప్పటి వరకు పట్టణంలోని 7,328 మంది లబ్ధిదారులకు సిద్ధం చేసిన పట్టాల ను పంపిణీకి చర్యలు చేపట్టాలన్నారు. పట్టణంలో 22 లేఅవుట్లలో ఇంటి నిర్మాణానికి అనువుకాని స్థలాలను హౌసింగ్ డీఈ, ఏఈ పరిశీలించాక, లబ్ధిదారులకు వేరే స్థలం కేటాయించాలన్నారు. ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానాన్ని ఫార్మ్-6 తీసుకుని 65శాతం పూర్తి చేయాలన్నారు. నిత్యం హౌసింగ్ నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, హౌసింగ్ డీఈ రామస్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.