దివ్యాంగులు తమ ప్రతిభ చాటుకునేందుకు, వారికి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ మేరకు ట్వీట్ చేశారు. దివ్యాంగులు ప్రదర్శిస్తున్న ధైర్యాన్ని, వారు సాధిస్తున్న విజయాలను ఆయన ప్రశంసించారు. దివ్యాంగుల జీవితాల్లో సానుకూల మార్పు కోసం కృషి చేస్తున్న వారందరికీ ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.