ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు అధికారులు అన్నిఏర్పాట్లు చేశారు. నేడు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 250 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ(ఎంసీడీ) పీఠం కోసం జరిగే ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఢిల్లీ ఓటర్లు ఎంసీడీ పీఠాన్ని ఎవరికి అందిస్తారో వేచిచూడాల్సిందే.