రైతులకోసం మరో ఉద్యమానికి సిద్ధమని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం మోపిదేవి మండలంలో రోడ్లపక్కన ఆరబోసిన వరి ధాన్యాన్ని మండలి పరిశీలించారు. బుద్ధప్రసాద్ వద్ద రైతులు కంటతడి పెట్టుకున్నారు. ఆర్. బి. కెల వద్ద ధాన్యం కొనుగోలు చేయడం లేదని, ప్రస్తుత తుఫాను వాతావరణ నేపద్యంలో చినుకు పడితే తమ బ్రతుకు మారిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేపటి వరకు ప్రభుత్వానికి మండలి బుద్ధప్రసాద్ డెడ్ లైన్ పెట్టారు. ఒక్క గింజ ధాన్యం తడిచినా ప్రభుత్వం తప్పిదమే అవుతుందన్న మండలి పేర్కొన్నారు. ఈ రోజు సాయంత్రం లోపు రోడ్లపక్కన ఆరబోసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి, రైస్ మిల్లులకు తరలించకపోతే ఆందోళన చేపడతామని చెప్పారు. నియోజకవర్గంలో కనీవినీ ఎరుగని రీతిలో రైతులతో ఉద్యమం చేపడతాం అన్న మండలి పేర్కొన్నారు.