రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్సి, ఎస్టీ, బిసి, మైనారిటీలకు పెద్దపీట వేసి ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడం జరుగుతోందని జమ్మలమడుగు శాసనసభ్యులు డాక్టర్ ములె సుధీర్ రెడ్డి అన్నారు. జమ్మలమడుగు మునిసిపాలిటీ పరిధిలోని 11 వ వార్డులో సోమవారం సాయంత్రం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్థానిక కౌన్సిలర్, నాయకులు, అధికారులతో కలిసి. ఆయా వీధుల్లో నివాసాలన్నింటినీ తిరిగారు. రాష్ట్రప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి. ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో నేరుగా మాట్లాడారు. పథకాల లబ్ధి సమా చారంతో కూడిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంతకం చేసిన బుక్ లెట్ను అందజేశారు.
కార్యక్రమంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్నవారు ప్రభుత్వ పాలనపై సంతృప్తి వ్యక్తం చేయగా. పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకురాగా. వెంటనే ఆయన ఆ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారుల
కు రెఫర్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి కుటుంబాన్ని రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై లబ్దిదారుల మనోభావాలను తెలుసుకుంటూ ముందుకుసాగారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి వేల్పుల శివమ్మ, మార్బల్ శీను, పాముల బ్రహ్మానందరెడ్డి, కౌన్సిలర్లు గౌరీ, పోచిరెడ్డి, కో- ఆప్షన్ సభ్యులు ఫయాజ్ బాషా పాల్గొన్నారు.