ప్రస్తుత యాంత్రిక జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో ఒత్తిడి ఎదుర్కొంటూనే ఉంటారు. ఈ ఒత్తిడి వల్ల శారీరక, మానసిక అనారోగ్యానికి ముప్పు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఒత్తిడిని అధిగమించేందుకు బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లు, మసాజ్, మెడిటేషన్, యోగ, మ్యూజిక్ థెరఫీ, అరోమా థెరఫీ వంటివి ప్రాక్టీస్ చేయాలని సూచిస్తున్నారు. నచ్చినవారితో సన్నిహితంగా మెలగడం, మంచి ఆహారం, సరైన నిద్ర అలవరచుకోవడం వంటివి పాటిస్తే ఒత్తిడిని చిత్తు చేయవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.