ఈరోజు పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ కంటే 6 రోజుల ముందుగానే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. అసలు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29 వరకు సభ ఉంటుందని ప్రకటించారు. అయితే లోక్‌సభ స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం లోక్‌సభ సమావేశాలను కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. లోక్‌సభలో మొత్తం 62 గంటల 42 నిమిషాల పాటు కార్యక్రమం జరిగినట్లు స్పీకర్ ఒంబిర్లా ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa