లక్ష్మీనరసింహస్వామి దేవాలయములో సోమవారం వార్షిక అధ్యయనోత్సవాలు సంప్రదాయరీతిలో నిర్వహించారు. కొండపై పంచనారసింహులు కొలువైన ప్రధాన ఆలయంలో ఆగమ శాస్త్రరీతిలో స్వస్తివాచనంతో మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు. స్వామివారికి, నమ్మాళ్వార్లకు 3న తిరుమంజనాలు నిర్వహించారు. ప్రధానఆలయంలో అష్టబుజి ప్రాకార మండపంలో లక్ష్మీనరసింహులను పట్టు వస్త్రాలు, వివిధ రకాల పుష్పాలతో దివ్యమునోహరంగా అలంకరించి తిరువీధి సేవాపర్వం నిర్వహించారు. సోమవారం రాత్రివేళ స్వామివారిని మత్యావతారంలో అలంకరించారు.