పాదాలు ఎక్కువ సేపు నీళ్లలో నానితే దురద సమస్య వస్తుంది. ఈ సమస్య రావొద్దంటే కాళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. పాదాల వద్ద ఎక్కువ తేమ చేరకుండా చూడాలి. ఎక్కువ సేపు షూ లేదా సాక్సులు వేసుకోవద్దు. పాదాలకు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. దురద ఎక్కువగా ఉంటే ఒక టబ్‌లో పాదాలు మునిగేంత నీళ్లు తీసుకొని అందులో 2 చెంచాల ఉప్పు వేసి కలపాలి. అందులో పాదాలను 10 నిమిషాలు నాననివ్వాలి. ఇలా 2 గంటలకోసారి చేస్తే దురద పోతుంది.