రాజమహేంద్రవరం కంబాలచెరువు హైటెక్ బస్టాండ్ సమీపంలో ఒక దివ్యాంగుడిపై కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి అతని వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోను లాక్కుని పారిపోయారు. ఈ సంఘటన ఆదివారం అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకుంది. బాధితుడి బంధువుల కథనం ప్రకారం రాజమహేంద్రవరం కంబాలచెరువు హైటెక్ బస్టాండ్ సమీపంలోఉన్న ట్యాక్సీ స్టాండ్‌లో నైట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న సంగిశెట్టి అమ్మిరాజు అనే దివ్యాంగుడు తరచూలాగే ఆదివారంరాత్రి బస్టాండ్‌కు వచ్చి ఉన్నాడు. ఈక్రమ ంలో అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి నిద్రలో ఉన్న అమ్మిరాజు జేబులోంచి డబ్బులు లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో వెంటనే మెలుకువ రావడంతో వారి చేయ్యిపట్టుకుని గిజాయించాడు. అయితే ఆ దొంగలు వారి వెంట తెచ్చుకున్న రాడ్‌తో అమ్మిరాజు తలపగలుగొ ట్టారు. అనంతరం రూ.800 నగదు, సెల్‌ఫోను పట్టుకుని పారిపోయారు. తలకు గాయాలతో పడివున్న అతన్ని తె ల్లారాక ట్యాక్సీ స్టాండ్ అసోసియేషన్ నాయకులు చూసి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అధికంగా రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమంగా ఉండటం తో అతన్ని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈమే రకు ఈ దాడిపై ఆసుపత్రి ఆవుట్ పోస్టులో ఎమ్‌ఎల్‌సీ రిపోర్టు అయ్యింది. ఇటీవల కొంతమంది యువకులు మ ద్యంమత్తులో అర్ధరాత్రి వేళలో నగరంలో హల్‌చల్ చేస్తూ కంటపడిన వారిపై దాడులుచేసి డబ్బులు, సెల్‌ఫో ను, గోల్డ్ చేతికి దొరికింది పట్టుకుని పోతున్నారు. కంబాలచెరువు హైటెక్ బస్టాండ్ సమీపంలో అసాంఘిక శక్తులు తిరుగుతు న్నాయని, పరిస్థితి దారుణంగావుందని ఇటీవల కొన్ని ప్రజా సంఘాలు ఎస్పీ, ఆర్‌టీసీ శాఖలకు ఫిర్యాదుచేసిన విష యం తెలిసిందే. ఇది జరిగి రెండు రోజులు గడవకుండానే ఒక దివ్యాంగుడిపై దాడిచేసి దోపిడీకి పాల్పడటం, వైజంక్షన్-కంబాలచెరువు సెంటర్‌ల మధ్య నడిరోడ్డు పై ఇలాంటి ఘటన జరగడం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.