ప్రభుత్వం కిరికెర గ్రామ పొలంలో కొటిపి రోడ్డు సమీపంలో రైల్వే ట్రాక్ దగ్గరలో మా స్థలంలో మేము పాతుకున్న బండలు కంచెను తొలగించారని సడ్లపల్లికి చెందిన వెంకటేశప్ప, గంగరత్నమ్మ, రామాంజినమ్మ, అనసూయమ్మ హిందూపురం రూరల్ అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై మంగళవారం విలేకరులతో వారు మాట్లాడుతూ 65-2బి2లో 3. 68 ఎకరాల పొలం మా తండ్రి అంజినప్ప పేరు మీద ఉందన్నారు. డిపట్టా పాసుపుస్తకం ఉందని అయితే వే మము అందులో పంట పెట్టుకుని మా ఆధీనంలోనే ఉంది. కొంతమంది అధికార పార్టీకి చెందిన నాయకుల ప్రోద్బలంతో కొం తమంది ఆ భూమిని ఎన్ ఓసీ తెచ్చుకున్నామని మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. పట్టణానికి చెందిన షేక్ అస్లం, ఫయాజ్, మాజిన్లు మాపై పొలంవద్ద దాడికి ప్రయత్నించారని వాపోయారు. అధికార పార్టీ నాయకుల ఒతి ళ్లతోనే పేదలైన మమ్మల్ని భూమినుంచి గెంటేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉంటే ఈ భూమి విషయంలో వీఆర్క్ గీతాంజలిని వివరణ కోరగా గతంలో ఆ స్థలం ప్రభుత్వం స్వాధీనం చేసుకుందన్నారు.