గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని టూటౌన్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. టూటౌన్ సీఐ సీహెచ్ లక్ష్మణరావు తెలిపిన వివరాల ప్రకారం. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతరిగి మండలం, గుమ్మ పంచాయతీ చెరుకుబిడ్డ గ్రామానికి చెందిన బిసాయి దేముడు బాబు అనేవ్యక్తి గతంలో వైఎస్సార్ నగర్ లోని చలుమూరి సాయి, మురళీకృష్ణ అనే వ్యక్తులకు గంజాయి సరఫరా చేసిన కేసులో పరారీలో ఉన్నాడు. వైఎస్సార్ నగర్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పక్కా సమాచారంతో టూటౌన్ సీఐ తన సిబ్బందితో కలిసి బిసాయి దేముడు బాబును అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు.
గంజాయిని ఒడిశా సరిహద్దు గ్రామాల్లో తక్కువ ధరకు కొనుగోలుచేసి విజయనగరం పరిసర ప్రాంతాల్లో ఎక్కువ ధరకు అమ్ముతున్నట్టు తెలిపాడు. గతేడాది నవంబర్లో మోహన్ సాయి, మురళీకృష్ణల నుంచి రూ. 9వేలు తీసుకుని కిలోన్నర గంజాయిని గంట్యాడ వద్దకు వచ్చి అప్పగించినట్టు నేరాన్ని అంగీకరించాడన్నారు. ఈ మేరకు అతడిని అరెస్టుచేసి రిమాండకు తరలించామన్నారు టూటౌన్ సీఐ లక్ష్మణరావు.