రోజుకు 1 లీటర్ కంటే తక్కువ మూత్రం విడుదలైనప్పుడు మూత్రపిండాల్లో రాళ్ల సమస్య తలెత్తుతుంది. అందుకోసం మూత్రపిండాల్లో రాళ్లు ఉన్న వ్యక్తి రోజూ తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. రోజుకు సుమారు 3-4 లీటర్ల నీరు తాగాలని వైద్యులు సూచిస్తుంటారు. రోజూ వ్యాయామం చేసే వారు, ఆరుబయట పని చేసే వారు ఇంకా ఎక్కువగా నీళ్లు తాగాల్సి ఉంటుంది. డీహైడ్రేషన్ ను నివారించడానికి వ్యాయామం చేస్తున్న సమయంలోనూ తగినంత నీరు తాగడం ముఖ్యం.