పబ్లిక్ మీటింగ్స్ లో... యాత్రలలో దర్శనమిచ్చే దొంగలు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో చేతివాట ప్రదర్వించారు. ఇదిలావుంటే నారా లోకేశ్ పాదయాత్ర మదనపల్లి నియోజకవర్గంలో కొనసాగుతోంది. గురువారమే 500 కిలోమీటర్ల మైలురాయికి చేరుకుంది. ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. లోకేష్ పాదయాత్రకు వెళ్లాలంటే.. నాయకులు, కార్యకర్తలు భయపడే పరిస్థితి నెలకొంది. ఎక్కడ తమ జేబులు కత్తిరిస్తారో అని.. నాయకులు భయపడుతున్నారు. అవును..నారా లోకేశ్ పాదయాత్రలో జేబు దొంగలు హల్ చల్ చేశారు.
నారా లోకేష్ పాదయాత్రలోకి జేబు దొంగలు రావడం కలకలం రేపుతోంది. పీలేరు, మదనపల్లి నియోజకవర్గాల్లో పాదయాత్ర జరుగుతున్నప్పుడు.. తమ పర్సులు పోగొట్టుకున్నామని పలువురు టీడీపీ నేతలు వాపోయారు. దీంతో జేబు దొంగల (Pickpockets) తో జాగ్రత్తగా ఉండాలని.. పాదయాత్రలో పాల్గొన్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని నేతలు సూచిస్తున్నారు. ఇటు పాదయాత్రలో లోకేష్.. ప్రజలతో మమేకం అవుతూ సాగుతున్నారు. మదనపల్లిలో టమాట ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు.