పిల్లలలోఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ సమా వేశపు మందిరం నందు వైద్య ఆరోగ్యశాఖ, స్త్రీశిశుసం క్షేమ, సర్వశిక్ష అభియాన్, విద్యాశాఖ , ఇంటర్ మిడియట్, సిపిఓ , డిసిహెచ్ఎస్ అధి కారులతో పిల్లల, గర్భవతులు, బాలింతలు, 10 నుండి 19 సంవత్సరాల బాలికలలో రక్తహీనత ను తగ్గించడానికి తీసు కోవలసిన చర్యలపై సమీక్ష సమావేశము నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ విద్యాశాఖ సమ న్వయంతో పని చేయాలని సూచిం చారు. క్షేత్రస్థాయిలో ఏఎన్ఎంలు, అంగ న్వాడి కార్యకర్తలు కలసి పనిచేయడం ద్వారా నివేదికల్లో తేడా లేకుండా ఉండేందుకు అవ కాశం కలదన్నారు.
సచివాలయ పరిధి లోని చిన్నపిల్లలు, 10 నుండి 19 సంవత్సరాల లోపు బాలికలను గర్భ వతుల అందరికి పరీక్షలు చేయాలని, ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. పిల్లలకు జగనన్న గోరుముద్ద, డి వాల్మీ ఐఎఫ్ టాబ్లెట్స్ అందించిన విదంగా డేటాఉండాలన్నారు.