రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఎన్నికపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్ మీనా ఆదేశించారు. కాగా, ఈ ఏడాది మార్చి 24న అంతర్వేదిలో జరిగిన సభలో రాపాక మాట్లాడుతూ పూర్వం నుంచి తమ సొంత గ్రామం చింతలమోరికి కొందరు దొంగ ఓట్లు వేయడానికే వచ్చేవారని, అవే తన విజయానికి దోహదపడేవని వ్యాఖ్యానించారు. దీనిపై దుమారం రేగటంతో రాపాక ఎన్నికపై విచారణకు ఆదేశించారు.