ఇటీవల కురిసిన వర్షాల కారణంగా మొక్కజొన్న పంట తడిసిన రైతులు జాగ్రత్తలు పాటించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి కే. మురళీకృష్ణ తెలిపారు. బుధవారం ఘంటసాల మండలంలోని పలు గ్రామాల్లో మొక్కజొన్న పంటను ఆయన పరిశీలించారు. పంట తడిసిన రైతులు ఉప్పు ద్రావణాన్ని పిచికారి చేసుకోవాలని, తడిసిన పంటను ఎండబెట్టుకోవాలని తెలిపారు. మొక్కజొన్న పంట కొనుగోలు ప్రారంభమైనట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రైతులు అధైర్య పడవద్దని, మొక్కజొన్న పంట ఆరిన తర్వాత 14% తేమ ఉంటే కొనుగోలు చేపట్టనున్నట్లు తెలిపారు.