రానున్న సాధారణ ఎన్నికలకు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని అన్ని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశిం చారు. గురువారం విజయవాడ ఎన్నికల ప్రధాన అధి కారి కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న జనరల్ ఎన్ని కలకు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని, కేంద్ర ఎన్నికల కమిషనర్ గైడ్‌లైన్స్ ఎప్పటికప్పుడు అనుసరించాలని అన్నారు. పెండింగ్ క్లైయిమ్స్, అబ్జెక్షన్స్‌ను త్వరి తగతిన పూర్తి చేసి 6, 7 ఫార్మాట్ల ద్వారా ఓటర్ జాబితాలో మార్పు లు చేర్పులు చేసి మే నెల 31 వ తేదీ నాటికి ఓటర్ల సప్లిమెంటరీ జాబితాను సిద్ధం చేయాలన్నారు. ఈ.ఆర్.వో.నెం: 2.0పై అవగాహన ఉండాలన్నారు. అనంతరం వివిధ రకాల ఎన్నికల కార్యక్రమాలపై పలువురు కలెక్టర్లు పవర్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ఎన్నికల ప్రధా నాధికారికి వివరించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ డా.సృజన, కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి డీఆర్వో నాగేశ్వరరావు, డ్వామా పీడీ అమర్నాథ్‌రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మల్లికార్జునుడు, రమ, ఎన్ని కల సూపరింటెండెంట్ మురళి తదితరులు పాల్గొన్నారు.