సూర్యుని తన ప్రతాపాగ్నికి ప్రజలు అల్లాడిపోతున్నారు. బుధవారం ఉదయం భానుడు భగభగమంటూ తన ప్రతాపాన్ని చూపించాడు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లే ప్రయాణికులు వడగాల్పులకు తట్టుకోలేక విలవిల్లాడిపోతున్నారు. బయటికి వెళ్లాలంటేనే భయపడేలా ఎండలు తారెత్తిస్తున్నాయి. వేడి గాలులు, ఉక్కపోతలు, అధిక వేడులతో ప్రజలు ఉక్కిరిబిక్కిర వుతున్నారు. జిల్లాలో గత కొద్దిరోజులుగా ఎండలు మండిపోతు న్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలకు తోడు వేడి గాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండల దాటికి జనం నిరసిస్తుండగా రాత్రిళ్ళు ఉక్క పోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో పగలు బయటకు తిరగలేక, రాత్రిపూట ఇళ్లల్లో నిద్ర పోలేక జనం అల్లాడిపోతున్నారు. ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండీషనర్ల కోసం జనం పరుగులు తీస్తున్నారు. గత కొన్ని రోజులుగా జిల్లాలో 46 డిగ్రీలకు తగ్గకుండా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అధిక ఎండలు కారణంగా రోడ్లు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.