ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థులలో ఏకాగ్రత ఉండాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 08, 2023, 12:28 PM

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ధర్మవరం శాఖా గ్రంధాలయం ఆధ్వర్యంలో వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా 32వ దినమున విద్యార్థిని, విద్యార్థులకు ఏకాగ్రత గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం అయినది. ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్ గా చంద్రశేఖర్ వ్యవహరించారు. ఈయన విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడుతూ నిగ్రహం లేని వాడు, , నిలకడ లేని వాడు ఒకటేనని సామెత ఉన్నదని చెప్పారు. నిగ్రహం అంటే మనసును, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడమే అని అన్నారు. విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు ఇది చాలా అవసరం అని గురువారం తెలియజేశారు. తరగతి గదిలో పాఠం విన్నప్పుడు గానీ, , ఆ పాఠం ఇంట్లో చదువుతున్నప్పుడు గానీ, పరీక్షలు రాస్తున్నప్పుడు గానీ విద్యార్థికి నిగ్రహం తప్పనిసరి అని చెప్పారు. విద్యార్థికే కాదు, ఏ వ్యక్తి ఏ పని చేసినా దానిమీద శ్రద్ధ వహించాలని అన్నారు. నిగ్రహం అంటే ఏకాగ్రత. ఏ పని చేస్తున్నామో దానిమీద మనసు నిలబడమే ఏకాగ్రత అని చెప్పారు. మనకు శ్రద్ధతోపాటు లక్ష్యసిద్ధి ఉన్నప్పుడు ఏకాగ్రత సిద్ధిస్తుందని చెప్పారు. అందుచేత మనం కూడా ఏ పని చేసినా మనసును ఇంద్రియాలను నిగ్రహించుకున్నట్లయితే అనుకున్నది సాధించగలుగుతామని చెప్పారు. ఈ విధంగా సాధించినట్లయితే జీవితంలో విజేతలమై నిలుస్తామని తెలియజేశారు. అందుచేత ప్రతి విద్యార్థి ఏకాగ్రతతో చదవాలని, ఉన్నతమైన ఉద్యోగాలలో స్థిరపడాలని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి మల్లిపెద్ది చంద్రశేఖర రావు, సహాయకులు బి. సూర్యనారాయణ, గ్రంథాలయ పాఠకులు మహేష్, జగదీష్, సురేష్, కిరణ్, ప్రకాష్, సూరిబాబు, 73 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థులకు" చల్లని రాస్నా" ప్యాకెట్లను అందించడం జరిగినది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com