తెనాలి పట్టణంలో ఠారెత్తిస్తున్న ఎండలు కూరగాయలపైనా ప్రభావం చూపాయి. విపరీతమైన వేడి, వడగాలుల వల్ల దిగుబడులు తగ్గాయి. అదే విధంగా మార్కెట్కు వస్తున్న సరకు కూడా ఈ ఎండలకు త్వరగా పాడైపోతోంది. ఈ క్రమంలో కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. దీనితో ప్రజలపై మరో భారం పడింది. జిల్లాలోని గుంటూరు నగరంలో 3, తెనాలి పురపాలికలో 6, పొన్నూరు పురపాలికలో 1, మంగళగిరిలో-1 వెరసి మొత్తం 11 రైతు బజార్లు ఉన్నాయి. వీటికి నారాకోడూరు, సుద్దపల్లి, కొలకలూరు, నందివెలుగు, వేటపాలెం, మంచికలపూడి, పొన్నూరు, జంపని, లంక గ్రామాల నుంచి కూరగాయలు వస్తాయి. ప్రస్తుతం టమోటా మదనపల్లి నుంచి వస్తుంది. దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ కూరగాయల పంటలపై అధిక ఉష్ణోగ్రతలు చూపాయి. కాగా బహిరంగ మార్కెట్లో కూరగాయల ధరలు మరింత అధికంగా ఉన్నాయి.