ఫుల్లుగా తాగి మద్యం మత్తులో గొడవపడేవారు ఉంటారు. కానీ, ఇక్కడ ఈ మందు బాంబు ఏం చేశాడో మీరే చూడండి. తప్పతాగి ఏకంగా రహదారిపై 15 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన ఓ సైన్ బోర్డుపైకి ఎక్కి హల్‌చల్ చేశాడు. దానిపై విన్యాసాలు చేస్తూ.. పుషప్ లు తీసి పల్టీలు కొట్టే ప్రయత్నం చేశాడు. అతడు మైకంలో ఉన్న అతడు తమ మీద ఎక్కడ పడతాడోనని అటుగా వెళ్లిన వాహనదారులు ఆగిపోయారు. ఒడిశాలోని సంబల్‌పూర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేశారు. సంబల్‌పురి మహాని అనే అకౌంట్‌లోని ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడి చర్యలపై నెటిజన్లు చమత్కారంగా కామెంట్లు పెడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa