విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగి ఉండాలని విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున సోమవారం అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జీ-20 లో భాగంగా దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యతపై క్విజ్ పోటీలలో జిల్లా స్థాయి పోటీలో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్ ప్రదానో త్సవం చేశారు. జూన్ నెల 28వ తేదీన క్వీన్స్ మేరీ బాలికల హై స్కూల్ నందు నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొందిన మూడు స్కూళ్లకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో గెలుపొందిన వారికి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ క్విజ్ పోటీలలో జిల్లా పరిషత్ హై స్కూల్ చిట్టివలస చెందిన జి. ప్రవీణ్ కుమార్ జే. వెంకటకీర్తన లకు మొదటి స్థానం, రూ. 10, 000 బహుమతి జిల్లా పరిషత్ హై స్కూల్ నరవ స్కూలుకు చెందిన వి. అనిల్ గౌతమ్, జి. సౌజన్య లకు ద్వితీయ బహుమతి, రూ. 7500, జిల్లా పరిషత్ హై స్కూల్ అగనంపూడి కి చెందిన వి సాహితీ, జే. జస్వంత్ లకు తృతీయ బహుమతిగా రూ. 5000 ప్రైజ్ మనీ, సర్టిఫికెట్ అందించి నట్లు తెలిపారు. ఈనెల 14వ తేదీన విశాఖ జిల్లాలో జరుగనున్న రాష్ట్ర స్థాయి అర్ బి ఐ ఆర్థిక అక్షరాస్యత క్విజ్ కాంపిటేషన్ కు జిల్లా నుండి మొదటి స్థానం సంపాదించిన జిల్లా పరిషత్ హై స్కూల్ చిట్టివలస విద్యార్థిని విద్యార్థులు పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ ఎల్డీఎం శర్మ , ఎన్ మధు సూదన్ రావు విశాఖ జిల్లా ఫైనాన్షియల్ లిటర్సీ కౌన్సిలర్, విద్యార్థుల తల్లిదండ్రులు, తది తరులు పాల్గొన్నారు.