కర్నూలు జిల్లాలో నకిలీనోట్ల చలామణి వ్యవహారం కలకలంరేపింది. ఆస్పరికి చెందిన కానిస్టేబుల్ ఈ నోట్ల దందాలో సస్పెండ్ అయ్యారు. కానిస్టేబుల్ ఒక అసలు నోటుకు 3 నకిలీ నోట్లు ఇప్పిస్తానని రూ.30 లక్షల అసలు నోట్లు తీసుకున్నాడు. ఆస్పరి మండల రాజకీయ నేతల నుంచి ఈ డబ్బు వసూలు చేశాడు.. నకిలీ నోట్లు ఇవ్వకపోవడంతో కానిస్టేబుల్ కిడ్నాప్‌నకు సదరు నేతలు ప్లాన్ చేశారు. ఈ విషయం బయటపడటంతో కానిస్టేబుల్‌ను అధికారులు కర్నూలుకు పిలిపించారు. కానిస్టేబుల్‌కు డబ్బులు ఇవ్వడంతో పాటు కిడ్నాప్‌కు స్కెచ్ వేసిన ఇద్దరు నేతలను పోలీస్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దొంగనోట్ల బాగోతంలో హైదరాబాద్ గ్యాంగ్‌తో కానిస్టేబుల్‌కు సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఏకంగా రాజకీయ నేతలకు మస్కా కొట్టబోయిన కానిస్టేబుల్ ఇప్పుడు ఉద్యోగానికి ఎసరు తెచ్చుకున్నారు. ఈ నకిలీ కరెన్సీ నోట్ల వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.