ఆంధ్రప్రదేశ్‌లోని ముస్లిం పెద్దలు, మత గురువులతో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. మైనారిటీల వ్యవహారాలపై సమీక్షించే క్రమంలో నేరుగా వాళ్లతో చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఉన్నతాధికారులు సైతం హజరు కానున్నారు. పెద్దలు, మత గురువుల నుంచి విజ్ఞప్తులు, సూచనల మేరకు సీఎం వైయస్ జగన్ కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa