తమిళనాడులో తాయిల్‌పట్టిలో బాణాసంచా తయారీ యూనిట్‌లో అకస్మాత్తుగా పేలుడు సంభవించి ఇద్దరు మహిళా కార్మికులు మృతి చెందారని పోలీసులు మంగళవారం తెలిపారు. మృతి పట్ల సంతాపం తెలిపిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.ఇద్దరు మహిళా కార్మికులు పటాకులు, రోల్ క్యాప్‌ల తయారీకి పేలుడు పదార్థాలను నిర్వహిస్తుండగా ఘర్షణ కారణంగా పేలుడు సంభవించింది. మృతులు మురుగేశ్వరి, బాను (39)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.మంటలను ఆర్పేందుకు మూడు ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.