వరద సహాయక కార్యక్రమాల్లో ఉదారంగా వ్యవహరించాలని కలెక్టర్లు సీఎం వైయస్ జగన్ సూచించారు. వరద బాధితులకు కచ్చితంగా రేషన్ అందించాలన్నారు. సహాయక శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2 వేలు, వ్యక్తులైతే రూ.1000 చొప్పున ఇవ్వాలని ఆదేశించారు. వరదల వల్ల ఇల్లు దెబ్బతింటే రూ.10 వేల చొప్పున అందించాలని, అవసరమైన చోట వెంటనే కొత్త ఇళ్లను మంజూరు చేయాలని ఆదేశించారు. ఏటిగట్ల మీద ఉన్నవారికి వెంటనే పక్కా ఇళ్లను మంజూరు చేయాలని సూచించారు.