రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎస్‌ఐ (సివిల్), ఏపీఎస్పీ, ఏఆర్‌ఎ్‌సఐ పోస్టుల భర్తీకి ఏపీ రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గత ఏడాది నవంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రిలిమినరీలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈనెల 25 నుంచి 100 మీటర్లు, 1600 మీటర్ల పరుగు, ఎత్తు, ఛాతీ, బరువు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఏలూరు రేంజ్ పరిధిలో 9,689 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో 8,247 మంది పురుషులు, 1,442 మంది మహిళలు ఉన్నారు. 25న దేహదారుఢ్య పరీక్షలకు 600 మంది హాజరయ్యారు. 1600 మీటర్ల పరుగు పందేన్ని ఎనిమిది నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంది. ప్రతి అభ్యర్థికీ సెన్సార్ చిప్‌లను తగిలిస్తున్నారు. ఇద్దరు అభ్యర్థులు 1600 మీటర్ల పరుగు పందెంలో గమ్యానికి దగ్గర వరకూ చేరుకుని అలసిసొలసి కుప్పకూలి పడిపోయారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు .. కమాన్ .. కమాన్ అంటూ వారిని ప్రోత్సహించినా.. లేచి పరిగెత్తే ఓపిక లేక ఆ ఇద్దరూ చివరికి మోకాళ్లపె పాకుతూ.. పొర్లాడుతూ గమ్యాన్ని చేరుకున్నారు. వారికి కట్టిన సెన్సార్‌లో ‘ఇన్‌టైమ్’ అని రావడంతో కంప్యూటర్లో వారు అర్హత సాధించినట్లు బీప్ శబ్దాన్ని ఇవ్వడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.