టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం పోస్టు కార్డులపై చంద్రబాబు అరెస్టు అక్రమమని రాసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ...... చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతోందన్నారు. ఏ సర్వే చూసిన రానున్న ఎన్నికల్లో టీడీపీ అతి గొప్ప విజయాన్ని సాధించబోతున్నట్లు స్పష్టమవుతోందన్నారు. వైసీపీకి ఘోర పరాభవం తప్పదని జోస్యం చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa