రబీ సీజన్ సాగు చేసే రైతులకు 40 శాతం సబ్సిడీతో శనగ విత్తనాలు అందజేస్తున్నట్లు గురువారం మార్కెట్ యార్డు చైర్మన్ పి. వి. రమణారెడ్డి తెలిపారు. విత్తనాలు కావాల్సిన రైతులు సబ్సిడీ పోను కిలోకు రూ. 48. 60 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎకరాకు 20 కిలోల ప్యాకెట్లు 2 చొప్పున గరిష్టంగా 5 ఎకరాలు ఉన్న రైతులకు 10 ప్యాకెట్లు అందజేస్తారని తెలిపారు. కావాల్సిన రైతులు రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.