ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో మొబైల్‌కు వచ్చిన వచ్చిన ఓటీపీలతో మోసం చేస్తున్న గ్యాంగ్ ఆటకట్టించారు పోలీసులు. ఓటీపీలు సేకరించి విద్యార్థులకు తెలియకుండా బ్రాంచ్‌లు మార్చిన ముఠాను మన్నూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్దముడియం మండలానికి చెందిన ఓ విద్యార్థి తండ్రి మొబైల్‌కు రాజంపేటలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఈసీఈ బ్రాంచ్‌లో సీటు వచ్చినట్లు మెసేజ్ వచ్చింది. అయితే ఇటీవల ఈఈఈ బ్రాంచ్‌లో సీట్ వచ్చినట్లు మరో సారి మొబైల్‌కు సందేశం రావడంతో విద్యార్థి తండ్రికి అనుమానం వచ్చింది.
విద్యార్థి తండ్రి రాయచోటిలోని కలెక్టరేట్‌లో సోమవారం స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ చేయాలని ఎస్పీ కృష్ణారావు అదేశించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. తిరుపతి జిల్లాకు చెందిన పలుకూరి సమరసింహారెడ్డి అలియాస్ సమర, నల్లపోతుల దేవి, ముప్పల రవి అనే ముగ్గురు వ్యక్తులు తిరుపతి జిల్లాలోని రెండు ఇంజినీరింగ్ కాలేజీల్లో పని చేస్తున్నారు. వీరు ఇంటర్మీడియట్‌లో ప్రతిభ కనబరిచని విద్యార్థుల వివరాలు ముందుగానే సేకరించి.. మంచి కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తామని చెప్పి వారి నుంచి ఓటీపీ వివరాలు సేకరించారు.
ఆ తర్వాత ఆయా కాలేజీల్లో విద్యార్థులను చేరుస్తామని యాజమాన్యాలతో ఒప్పందం చేసుకుని విద్యార్థుల మొబైల్‌కు వచ్చిన ఓటీపీల ఆధారంగా బ్రాంచిల్లో సీట్లు కేటాయించినట్లు గుర్తించారు.ఆ కాలేజీల్లో సీట్లు లేని పక్షంలో.. అంతకు ముందు సీట్ సాధించిన విద్యార్థుల బ్రాంచిలను మార్చేసి సర్దుబాటు చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఈ ప్రక్రియలో పెద్దమండెం మండలానికి చెందిన విద్యార్థి తండ్రి మొబైల్‌కు రెండు సార్లు వేర్వేరు బ్రాంచ్‌ల్లో సీట్లు వచ్చినట్లు మెసేజ్ రావడం.. ఆయన స్పందనలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణలో ఈ వ్యవహారం బయటపడింది. ఈ క్రమంలో ముగ్గురు నిందితులను గుర్తించి కేసు నమోదు చేశారు. వారి నుంచి మొబైల్, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే సంబంధిత కళాశాల సిబ్బందిని మన్నూరు పోలీసులు స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.