డిసెంబరు నుంచి విశాఖ పరిపాలన కేంద్రంగా మారుతుందని, సీఎం జగన్ వెల్లడించారు. రుషికొండ ఐటీ పార్కులో ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్(డీసీ)ను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..... విశాఖపట్నం త్వరలో ఐటీ హబ్‌గా మారనుందని అన్నారు. విశాఖ టైర్-1 సిటీగా ఎదగడానికి ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి సంస్థలు దోహదపడతాయన్నారు. అదానీ డేటా సెంటర్ 24 నెలల్లో ప్రారంభమవుతుందన్నారు. ఏ అవసరం వచ్చినా ఒక్క ఫోన్ చేస్తే చాలని, అండగా ఉంటామని ఇన్ఫోసిస్‌కు సీఎం హామీ ఇచ్చారు. కాగా, విశాఖపట్నంలోని ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని హైబ్రిడ్ మోడల్‌గా అభివృద్ధి చేయనున్నట్టు ఆ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్‌వో) నీలంజన్ రాయ్ ప్రకటించారు. స్థానికంగా ప్రతిభావంతులు ఉంటే వారికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa