రక్షా మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అక్టోబర్ 21, 2023న న్యూ ఢిల్లీలో ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ యొక్క మొదటి ఎడిషన్‌ను ప్రారంభించారు. రెండు రోజుల ఉత్సవం సంభాషణలు, కళ, శతాబ్దాలుగా అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క గొప్ప సైనిక సంస్కృతి మరియు వారసత్వాన్ని జరుపుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ప్రధానంగా ప్రముఖ పండితులు, అభ్యాసకులు మరియు సేవలందిస్తున్న అలాగే రిటైర్డ్ అధికారులచే ప్యానెల్ చర్చల ద్వారా విభిన్న అవగాహనలు మరియు దృక్కోణాలను ముందుకు తెస్తుంది. ఈ సందర్భంగా శ్రీ రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ, గత కొన్ని దశాబ్దాలుగా దేశ భద్రతలో సాయుధ బలగాల సాటిలేని ధైర్యసాహసాలను, అమూల్యమైన పాత్రను చాటిచెప్పిన భారత సైనిక వారసత్వ ఉత్సవం దేశ యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ఇది భారత సైన్యం గురించి మరియు వారి సాహసోపేత చర్యల గురించి మరింత తెలుసుకోవడానికి వారికి ఉత్సాహాన్ని కలిగిస్తుందని ఆయన అన్నారు.