బీసీలంటే బ్యాక్‌వర్డ్ కాస్ట్ కాదని, వెన్నెముక వంటి బ్యాక్‌బోన్ క్లాస్ అని సీఎం వైయస్ జగన్ బీసీలను అక్కున చేర్చుకొని, అన్నింటా పెద్దపీట వేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు డిప్యూటీ సీఎం పదవులతో పాటు పూర్తి అధికారాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారన్నారు. ఎంపీ, ఎమ్మెల్సీ, కార్పొరేషన్, నామినేటెడ్ పదవుల్లో చరిత్రలో మరే సీఎం చేయని విధంగా అధిక శాతం పదవులు ఇచ్చారన్నారు. నలుగురు బీసీలను సీఎం జగన్ రాజ్యసభకు పంపడం విశేషమన్నారు. నందిగం సురేష్ వంటి పేదింటి వ్యక్తిని పార్లమెంట్‌కు పంపిన ఘనత జగనన్నదేనని అన్నారు. బీసీలకు జడ్జి పోస్టులు వద్దని లేఖ రాసిన ఘనుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు.