గుంటూరు జిల్లా సీనియర్ ఖోఖో జట్ల ఎంపిక ఆదివారం నిర్వహించనున్నట్లు ఖోఖో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి చింతా పుల్లయ్య శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నరసరావుపేటలోని కృష్ణవేణి డిగ్రీ కళాశాల న్యూ క్యాంపస్లో మధ్యాహ్నం 2 గంటలకు సెలక్షన్స్ ప్రారంభమవుతాయని తెలిపారు. సీనియర్ బాలబాలికలు సెలక్షన్స్కు హాజరుకావచ్చన్నారు. వయస్సుతో నిమిత్తం లేదని అడ్రస్ ధ్రువీకరణ కోసం ఆధార్కార్డు తెచ్చుకోవాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa