కరువు ప్రాంతాలుగా ముద్ర వేసుకున్న రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగునీటిని వసతి కల్పించి దుర్భిక్షంలో ఉన్న ప్రాంతాలను సుభిక్షం చెయ్యాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి సంకల్పించుకున్నారు. ఆదిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గాలేరు- నగరి జంట టన్నెల్స్ ద్వారా 20 వేల క్యూసెక్కుల నీటిని అవుకు రిజర్వాయర్ కు విడుదల చేసిన సియం జగన్.. అవుకు జీఎన్ ఎస్ ఎస్ రెండో టన్నెల్ ను జాతికి అంకితం ఇచ్చారు. కాగా రిజర్వాయర్ కు నీటిని విడుదల చేసేందుకు అవుకు వస్తున్న సీఎం కు స్వాగతం పలికేందుకు తరలి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసిపి నేతలు తరలి వచ్చారు. నీటిని విడుదల చేసిన తరువాత స్థానిక నాయకులతో సీఎం జగన్ సమావేశమై చర్చించారు.
ఈ సమావేశంలో స్థానిక నేతలు స్థానికం గా నెలకొన్న విషయాలను, సమస్యలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. కాగా గతంలో దివంగత ముఖ్య మంత్రి వైఎస్సార్ హయాంలో అవుకు సొరంగాల పనులకు రూ.340.53 కోట్లు వెచ్చించి సింహభాగం పూర్తి చేశారు. కాగా 2014-19 మధ్య చంద్రబాబు సర్కారు రూ.81.55 కోట్లు మాత్రమే వ్యయం చేసి ఫాల్ట్ జోన్‌లో పనులు చేయకుండా చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ రూ.145.86 కోట్లు ఖర్చు చేసి టన్నెల్ 2 పనులను దిగ్విజయంగా పూర్తి చేశారు. అలానే మరోవైపు టన్నెల్ 3 పనుల కోసం ఇప్పటివరకు మరో రూ.934 కోట్లు వెచ్చించి దాదాపు తుదిదశకు తీసుకు వచ్చిన ఘనత సీఎం జగన్ కె దక్కుతుంది.