టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 3వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తేటగుంట పంచాయతీలో ఈ మైలురాయికి గుర్తుగా పేదల ఆకలి తీర్చే అన్నాక్యాంటీన్లను కొనసాగిస్తామని హామీ ఇస్తూ పైలాన్‌ను లోకేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి లోకేష్ సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్, నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్, బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ హాజరయ్యారు. పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లోకేష్‌తో కలిసి కుటుంబసభ్యులు నారా బ్రహ్మణి, దేవాన్ష్, మోక్షజ్ఞ, భరత్ పాదయాత్ర చేశారు. అలాగే లోకేష్‌కు సంఘీభావం తెలుపుతూ టీడీపీ ముఖ్య నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. ఇటు మంగళగిరి పార్టీ ఆఫీస్‌లో కూడా 3 వేల కిలో మీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa