ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి, దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయి పరిశీలన చేయాలి. కొంతమందికే నష్టపరిహారం అంటే కుదరదు. ప్రతి రైతుకు, ప్రతి ఎకరాకు పంట నష్టం ఇవ్వాలి అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. కవులూరులో గురువారం ఆయన దెబ్బతిన్న వరి, మిర్చి పంటలను పరిశీలించారు. ఇబ్రహీంపట్నం మండలం ఈలప్రోలులో దెబ్బతిన వరి పంటను రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. కవులూరులో ఇప్పటికీ వరి మాగాణుల్లో నిల్వ ఉన్న నీటిని ఉమాకు చూపించారు. దెబ్బతిన్న మిర్చి పంటలో కూర్చుని ఉమా నిరసన తెలిపారు. నాలుగేళ్లుగా పంట కాలువల పూడిక తీయకపోవడంతో డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేదని, అందుకే రైతులకు భారీ నష్టం వాటిల్లిందని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. తుఫాన్ వల్ల జరిగిన నష్టం కంటే ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత వల్లే రైతులకు భారీ నష్టం వాటిల్లిందన్నారు. 2003లో చంద్రబాబు నీరు కారుతున్న బాతులు తినని ధాన్యాన్ని సైతం కొనుగోలు చేశారన్నారు. పనికిమాలిన ప్రజా ప్రతినిధుల వల్లే రైతులకు నేడు ఈకర్మ పట్టిం దని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.