నిన్నటి దాక జనసేన జెండా పట్టుకున్న పిల్ల సైనికులు ఇప్పటి నుంచి టీడీపీ జెండా మోయాల్సి వస్తోంది.. వారిని చూస్తే జాలేస్తోంది అంటూ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీ- జనసేన ఉమ్మడి మేనిఫెస్టోపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఎక్కడ స్టార్ట్ చేశాడు ఎక్కడ పూర్తి చేశాడో అవగాహన లేదు అంటూ విమర్శించారు. అన్ని జిల్లాల నుంచి ప్రజలను తరలించినా యువగళం ముగింపు సభ మూగబోయింది.. ప్యాకేజీ కోసం సీఎం పదవిని పవన్ కళ్యాణ్ తాకట్టు పెట్టారు.. పవన్ మనస్తత్వం, స్వభావం మారాలి.. రోజుకో జెండా పట్టుకుంటున్న పవన్ కళ్యాణ్ తీరును చూస్తే నవ్వు వస్తోంది అని ఆయన చెప్పారు. నిన్నటి దాక జనసేన జెండా పట్టుకున్న పిల్ల సైనికులు ఇప్పటి నుంచి టీడీపీ జెండా మోయాల్సి వస్తోంది.. వారిని చుస్తే జాలేస్తోంది అంటూ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో తెలుగు దేశం- జనసేన పార్టీలకు చెందిన నేతలు చొక్కాలు పట్టుకుని తన్నుకుంటున్నారు అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ప్యాకేజీలో తేడాలు వస్తే పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు చొక్కా పట్టుకునే రోజు వస్తుంది.. యువగళం సభ అట్టర్ ప్లాప్ కావడంతో వచ్చే ఎన్నికల్లో గెలుపు మీద టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆశలు పోయాయి.. టీడీపీ- జనసేన కలయిక వైయస్ఆర్ సీపీకి ఉపయోగం కలిగిస్తుంది అని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో వైయస్ఆర్ సీపీ 175 స్థానాలు గెలుస్తుందని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.