ఏపీలో సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. ప్రతి ఏటా రెండుసార్లు జనవరి, జూన్ లో అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణం చేతనైనా మిగిలిపోయిన వారికి జూన్ / జూలైలో.. జూలై నుంచి డిసెంబర్ వరకు అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి మిగిలిపోయిన వారికి డిసెంబర్ / జనవరిలో అందిస్తున్నారు. ఆగస్టు 2023 నుంచి డిసెంబర్ 2023 వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని 68,990 అర్హులకు రూ. . 97.76 కోట్లను ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. సీఎం క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల లబ్ది అందించాలన్న తపనతో.. పథకం లబ్ది అందించిన తర్వాత కూడా పొరపాటున ఏ కారణం చేతనైనా మిస్ అయిన వారికి మరో అవకాశం ఇస్తోంది ప్రభుత్వం. ఆగస్టు 2023 - డిసెంబర్ 2023 వరకు అర్హులైన మరో 1,17,161 మందికి పెన్షన్లు, 6,314 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు, 1,11,321 మందికి రైస్ కార్డులు, 34,623 మందికి ఇళ్ల పట్టాలను కూడా నేడు అందిస్తోంది ప్రభుత్వం. వైఎస్సార్2సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 55 నెలల్లోనే వివిధ సంక్షేమ పథకాల ద్వారా అందించిన ఆర్థిక సాయం రూ.2,46,551 కోట్లు.
6 నెలల కాలానికి సంబంధించి అందించిన సంక్షేమ పథకాలకు అర్హత ఉండి ఆయా పథకాల లబ్ధి మిన్ అయిన వారికి మరో అవకాశం కల్పించింది ప్రభుత్వం. పథకాల లబ్ది అందించిన నెలలోపు గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి.. అవసరమైతే వాలంటీర్ సేవలు వాడుకోవచ్చు లేదా 1902 కి ఫోన్ చేస్తే వారు తగు సూచనలు ఇస్తారు. అవసరమైన పత్రాలతో సచివాలయాల్లో అప్లై చేసిన తర్వాత వెరిఫికేషన్ చేసి ఆరు నెలలకోసారి ఆ ఆరు నెలల్లో అమలు చేసిన సంక్షేమ పథకాల లబ్ధి అర్హులకు అందజేస్తారు.. ఇలా ఏటా రెండుసార్లు డబ్బుల్ని జమ చేస్తున్నారు. సోషల్ ఆడిట్ కోసం గ్రామ/వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాల ప్రదర్శిస్తారు.
ఆగష్టు 2023 నుంచి డిసెంబర్ 2023 వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా పొరపాటున ఆయా సంక్షేమ పథకాల లబ్ధి అందుకోలేకపోయిన అర్హులకు నేడు అందిస్తున్న నగదు లబ్ధి అందిస్తున్నారు. ఈబీసీ నేస్తం పొరపాటున ఏ కారణం చేతనైనా మిగిలిపోయిన లబ్ధిదారుల సంఖ్య – 4,180, అలా మిగిలిపోయినవారికి నేడు అందిస్తున్న లబ్ధి (రూ.లలో) 6,27,00,000.
జగనన్న అమ్మ ఒడి – పొరపాటున ఏ కారణం చేతనైనా మిగిలిపోయిన లబ్ధిదారుల సంఖ్య – 40,616, అలా మిగిలిపోయినవారికి నేడు అందిస్తున్న లబ్ధి (రూ.లలో) 53,06,68,670
వైఎస్సార్ నేతన్న నేస్తం – పొరపాటున ఏ కారణం చేతనైనా మిగిలిపోయిన లబ్ధిదారుల సంఖ్య – 352, అలా మిగిలిపోయినవారికి నేడు అందిస్తున్న లబ్ధి (రూ.లలో) 84,48,000
వైఎస్సార్ కాపు నేస్తం – పొరపాటున ఏ కారణం చేతనైనా మిగిలిపోయిన లబ్ధిదారుల సంఖ్య – 1,884, అలా మిగిలిపోయినవారికి నేడు అందిస్తున్న లబ్ధి (రూ.లలో) 2,82,60,000
వైఎస్సార్ వాహన మిత్ర – పొరపాటున ఏ కారణం చేతనైనా మిగిలిపోయిన లబ్ధిదారుల సంఖ్య – 3,030, అలా మిగిలిపోయినవారికి నేడు అందిస్తున్న లబ్ధి (రూ.లలో) 3,03,00,000
జగనన్న చేదోడు – పొరపాటున ఏ కారణం చేతనైనా మిగిలిపోయిన లబ్ధిదారుల సంఖ్య – 15,016, అలా మిగిలిపోయినవారికి నేడు అందిస్తున్న లబ్ధి (రూ.లలో) 15,01,60,000
వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా – పొరపాటున ఏ కారణం చేతనైనా మిగిలిపోయిన లబ్ధిదారుల సంఖ్య – 1,912, అలా మిగిలిపోయినవారికి నేడు అందిస్తున్న లబ్ధి (రూ.లలో) 14,70,95,000
వైఎస్సార్ మత్స్యకార భరోసా – పొరపాటున ఏ కారణం చేతనైనా మిగిలిపోయిన లబ్ధిదారుల సంఖ్య – 2,000, అలా మిగిలిపోయినవారికి నేడు అందిస్తున్న లబ్ధి (రూ.లలో) 2,00,000