ఎన్టీఆర్ వర్థంతి, ఏఎన్ఆర్ శత జయంతి సందర్భంగా విశాఖలో లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమాలను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యండమూరి వీరేంద్రనాథ్ కు లోక్ నాయక్ ఫౌండేషన్ అవార్డును అందించారు.
మెగాస్టార్ చిరంజీవి ఈ అవార్డును యండమూరికి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు జడ్జి శేషసాయి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు.