నెల్లూరు నగరంలో తానే స్వయంగా ప్రతి ఇంటికి తిరిగి దొంగ ఓట్లు గుర్తించానని నారాయణ చెప్పారు. బీఎల్వోలు తొలగిస్తే, అధికారులు మళ్లీ వాటిని చేర్చారన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఓ కలెక్టర్ ఏకంగా వైసీపీ నేతలకు దొంగ ఓట్లు చేర్చుకోవడానికి లాక్ కోడ్ ఇవ్వడం దారుణమన్నారు. తుది జాబితాల్లో దొంగ ఓట్లు తొలగించకుంటే సహించేది లేదని, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. సీఈసీ కూడా పట్టించుకోకపోతే కోర్టులకు వెళుతామని, న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందని నారాయణ వ్యాఖ్యానించారు.