బడ్జెట్ ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే.” వచ్చే 5 ఏళ్లలో పీఎం ఆవాస్ యోజన కింద 2 కోట్ల ఇళ్ల నిర్మాణం, ఆశాలు, అంగన్వాడీలకు ఆయుష్మాన్ పథకం వర్తింపు, 9 నుంచి 18 ఏళ్ల బాలికలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా చర్యలు, త్వరలో మరిన్ని మెడికల్ కాలేజీలు ఏర్పాటు,
517 కొత్త ప్రాంతాలకు విమాన సర్వీసులు, టూరిస్ట్ హబ్ గా లక్షద్వీప్, మత్స్య రంగంలో 55 లక్షల ఉద్యోగాలు కల్పించాం. యువత కోసం లక్ష కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు, 1000 కొత్త విమానాల కొనుగోలుకు ఆర్డర్, రోడ్డు, రైలు కారిడార్ లను ఏర్పాటు చేస్తాం, మా దృష్టిలో జీడీపీ అంటే గవర్నెన్స్, డెవలప్ మెంట్, పర్ఫార్మెన్స్." అని అన్నారు.