బహుముఖ ప్రజ్ఞశాలి, రాజనీతిజ్ఞుడు అన్న పదాలకు సరిపాటిగా నిలిచే వ్యక్తి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు. ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధాన మంత్రిగా ఇలా ఏ పదవిని చేపట్టినా తదుపరి వ్యక్తులకు ఓ మార్గదర్శిగా నిలిచిన వ్యక్తి పీవీ. తెలుగుఖ్యాతిని దశదిశలా చాటిన పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడంపై తెలుగువారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అనుకోకుండా ప్రధానమంత్రిగా పీవీ
పీవీ జాతీయ విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తూ ఆయనకి ప్రధానమంత్రి పదవి అనుకోకుండా వరించింది. 1991 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చెయ్యకుండా, దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెసు పార్టీకి నాయకుడు లేకుండా పోయాడు. ఆ సమయంలో తనకంటూ ప్రత్యేక గ్రూపు లేని పీవీ అందరికీ ఆమోదయోగ్యుడుగా కనపడ్డాడు. వానప్రస్థం నుండి తిరిగివచ్చి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు.