సైబర్ నేరాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో వర్క్ ఫ్రం హోం పేరుతో సైబర్ కేటుగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ వివాహిత సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. నగరంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్‌నగర్‌కు చెందిన కె.రవిప్రసాద్ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. ఆయన భార్య దివ్యసురేఖ గృహిణి. గత నెల 15న తన ఇన్‌స్టాగ్రామ్‌కు.. ఇంటి దగ్గరే ఉంటూ ఆన్‌లైన్‌లో నగదు సంపాదించవచ్చని ఓ మెసేజ్ వచ్చింది.
లింక్ క్లిక్ చేయగా టెలిగ్రామ్‌లో మరో లింక్ ఓపెన్ అయ్యింది. ఓ ఐదు దఫాలుగా డబ్బుల్ని చెల్లించి టాస్కులు చేయగా రెట్టింపుగా డబ్బులు పంపారు. 'అనంతరం మీరు చెల్లిస్తున్న మొత్తానికి రెట్టింపు చెల్లిస్తేనే మీ నగదు తిరిగి వస్తుందని' మెసేజ్‌లు రావడంతో పలు దఫాలుగా రూ.4.08 లక్షలు వరకూ ఆన్‌లైన్‌లో ఆమె చెల్లించారు. ఆ తర్వాత కూడా మరో రూ.5 లక్షలు చెల్లించాలని మెసేజ్ రావడంతో మోసపోయానని గ్రహించి బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఇలా లింక్‌ల పేరుతో మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అపరిచితులు పంపించే లింక్‌లను క్లిక్ చేయవద్దని.. అనుమానం వస్తే పోలీసులను సంప్రదించాలని సూచించారు.