ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్.. రాజధాని లక్నోలో ప్రమాదానికి గురైంది. సీఎం కాన్వాయ్ కంటే ముందు వెళ్తున్న యాంటీ డెమో వెహికల్ యాక్సిడెంట్‌కు గురైంది. వేగంగా కాన్వాయ్‌లోకి ఒక్కసారిగా కుక్క చొచ్చుకురావడంతో దాన్ని తప్పించే క్రమంలో యాంటీ డెమో వాహనానికి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మొత్తం 14 మందికి గాయాలు కాగా.. అందులో పోలీసులు, సాధారణ పౌరులు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వారిని హాస్పిటల్‌కు పంపించి చికిత్స అందించారు. శనివారం రాత్రి ఈ సంఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు.
టీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. శనివారం రాత్రి ఢిల్లీ నుంచి విమానంలో లక్నో చేరుకున్నారు. ఈ క్రమంలోనే లక్నో ఎయిర్‌పోర్టు నుంచి తన నివాసానికి వెళ్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సీఎం కాన్వాయ్ ముందు వెళ్తున్న యాంటీ డెమో వాహనం.. రోడ్డును సెర్చ్ చేస్తుండగా.. అర్జున్‌గంజ్ ప్రాంతంలోని మారి మాతా గుడి దగ్గర నుంచి కాన్వాయ్ వెళ్తుండగా అకస్మాత్తుగా దారిలో ఓ కుక్క అడ్డు వచ్చింది. కుక్కను కాపాడే ప్రయత్నంలో ఉండగా వాహనం ఒక్కసారిగా అదుపు తప్పడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కాన్వాయ్‌లోని వాహనం.. పక్కనే ఉన్న ఓ ప్రైవేటు వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో సీఎం కాన్వాయ్‌లోని వాహనాల్లో కూర్చున్న పోలీసులతోపాటు ఆ ప్రైవేటు కారులో కూర్చున్న ఇతర పౌరులు కూడా గాయాలపాలయ్యారు.
ఈ ప్రమాద విషయం తెలియగానే.. లక్నో డీఎంతో పాటు, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ ప్రసాద్ సివిల్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రికి వెళ్లి గాయపడిన వారి పరిస్థితిని తెలుసుకున్నారు. లక్నో పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఆస్పత్రికి వెళ్లారు. గాయపడిన వారిలో కొందరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. రోడ్డు మధ్యలో కుక్క అకస్మాత్తుగా కనిపించడంతో యాంటీ డోమో వాహనం అదుపు తప్పి సమీపంలో ఆగి ఉన్న ఓ ప్రైవేటు వాహనాన్ని ఢీకొట్టింది. లులు మాల్ వైపు వెళ్తున్న రెండో వాహనంలో ఐదుగురు ఉన్నారు. కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులందరినీ ట్రామా సెంటర్‌కు తరలించారు. గాయపడిన వారిని సెహ్నాజ్ (36), అక్సా (6), హస్నైన్ (1.5), నవేద్ (30), ముస్తకీమ్ (40) గా గుర్తించారు.