ఒడిశాలో పార్లమెంటు ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బిజూ జనతాదళ్ (బీజేడీ) నేతలు ఆ పార్టీకి షాక్ ఇస్తున్నారు. తాజాగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అరబింద ధాలీ అధికార బీజేడీ పార్టీకి శనివారం రాజీనామా చేశారు.
ఆయన బీజేపీలో చేరతారని సమాచారం. ఆయన రాజీనామా లేఖను బీజేడీ అధ్యక్షుడు, సీఎం నవీన్ పట్నాయక్‌కు ఈ-మెయిల్ ద్వారా పంపారు. రాజీనామా ఎందుకు చేశారన్న విషయాలు ఇంకా వెల్లడించలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa