టీడీపీ- జనసేన - బీజేపీ కూటమిని 5 కోట్ల ఆంధ్రులు స్వాగతిస్తున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ఉమ్మడి కూటమి సభ కోసం దేశమంతా ఎదురుచూస్తోందన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రధాని మోదీ, చంద్రబాబు , పవన్ దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. జగన్‌ను రాష్ట్రం నుంచి తరిమికొట్టే సభ కాబోతుందన్నారు. 175 నియోజకవర్గాల నుంచి 3 పార్టీల శ్రేణులు పాల్గొంటాయయని.. ఎలాంటి లోటు పాట్లు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa