చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో జరుగుతున్న ప్రజాగళం సభకు టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు పోటెత్తారు. దాదాపు పదేళ్ల తర్వాత ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఒకే వేదికపైకి చేరుతున్న నేపథ్యంలో.. మూడుపార్టీల్లో నూతనోత్తేజం నెలకొంది. వచ్చే ఎన్నికల కోసం టీడీపీ, బీజేపీ, జనసేన ఎన్డీయే కూటమిగా బరిలోకి దిగుతుండగా.. పొత్తు ఖాయమయ్యాక మూడు పార్టీలు కలిసి ఉమ్మడి నిర్వహిస్తున్న తొలి బహిరంగసభ ఇదే. ఈ నేపథ్యంలో సభను అత్యంత భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్సి నారా లోకేష్ ఆధ్వర్యంలో మూడుపార్టీల ముఖ్యనేతలతో కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీల ద్వారా ఏర్పాట్లను పర్యవేక్షించారు. బొప్పూడి వద్ద దాదాపు 300 ఎకరాల విస్తీర్ణంలో సభకు ఏర్పాటు చేశారు. అధికార వైసీపీని గద్దె దింపేడమే లక్ష్యంగా ముగ్గురు నేతల ప్రసంగాలు ఉండనున్నాయి.
మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ సఖ్యతగానే మెలుగుతూ వస్తోంది. పార్లమెంటులో కీలక బిల్లుల ఆమోదం కోసం ఆ పార్టీకి మద్దతిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం ఎలా ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రజాగళం సభ ప్రత్యక్ష ప్రసారం కోసం దిగువ చూడండి. మరోవైపు బొప్పూడి సభకోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఐదువేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు.