‘అరాచక పాలనకు చరమగీతం పాడతాం. అభివృద్ది, సంక్షేమం కోసం పాటుపడే వారికి మద్దుతుగా ఉంటాం అని జయప్రకాశ్ నారాయణ తెలిపారు. అయన మాట్లాడుతూ.... టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు లోక్ సత్తా అండగా ఉంటుంది. ఎన్నికల తర్వాత ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పాటుపడుతుందని విశ్వసిస్తున్నాం. సంక్షేమం, అభివృద్ది, ఉపాధి, పరిశ్రమలకు అవకాశం కల్పిస్తారనే నమ్మకం ఉంది. అందుకోసమే ఎన్డీఏకు లోక్ సత్తా అండగా నిలువనుంది. తమ పార్టీ నిర్ణయాన్ని ప్రజలు, మేధావులు, రైతులు ఆలోచించాలి. రాష్ట్రానికి మేలు చేసేది ఎవరో గమనించండి. ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపడంతో తనపై విమర్శలు వస్తాయి. తనపై కులం ముద్ర కూడా వేస్తారు. ఎన్డీఏకు మద్దతు అనే తన నిర్ణయం రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసమే తీసుకున్నా అని’ జయప్రకాశ్ నారాయణ స్పష్టం చేశారు.